Monday, September 10, 2007

నా చిన్ననాటి కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు.

September 11th, 2007

MAHESH

నన్ను రోజు నాన్న స్కూల్ లో వదిలి రాగానే మళ్ళీ ఏదో ఒక వంక పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేదాన్ని.మొదటి రోజుల్లో నేను సరిగా స్కూల్ కి వెళ్ళకపోయేదాన్ని.తర్వాత ప్రతి రోజు నిద్రలో లెక్కలు, ఇతర పాఠ్యాంశాలు కలవరించేదాన్ని. ఇప్పటికి నాన్న గుర్తు చేసి చాల నవ్వుతారు ఆ విషయాలు చెబుతూ.నేను హాస్టల్ నుండి సెలవులకి ఇంటికి వచ్చిన ప్రతీసారి నన్ను అమ్మ,నాన్న చాలా ప్రేమగా చూసేవారు.వాళ్ళు నాకు ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగా ఉండి నాతో అన్ని షేర్ చేసుకునేవాళ్ళు.నాన్న,నేను కలసి జగిత్యాల్ కి వెళ్ళి చాలా సినిమాలు చూసేవాళ్ళము.అమ్మ ఎప్పుడూ నాన్నకి తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చేది.చిన్నప్పటినుంచీ తమ్ముడిని, నన్ను ఎక్కువగా ప్రేమగా పెంచింది అమ్మమ్మ, తాతయ్యలు.వాళ్ళు ఇద్దరు మాతో పాటే ఉంటారు.నానమ్మ,తాతయ్య వాళ్ళు కూడ చాలా ప్రేమ చేసేవాళ్ళు.నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడళ్ళా నాకు డ్రెస్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు.నాన్న మరియు ఒక అంకుల్ రోజు రాత్రి చాల కథలు చెప్పేవాళ్ళు.తమ్ముడిని, నన్ను బాగా నవ్వించే వాళ్ళు ఏదో ఏదో చెప్పి. కాని ఇప్పుదు ఆ అంకుల్ ఈ లోకం లో లేరు.అది చాలా భాధకరమైన విషయం.ఇంకా నాకు ఎక్కువగా నవ్వు తెప్పించే విషయం ఏంటంటే నేను ఎప్పుడు మా ఇంట్లో కూరలు తినకుండా పక్కింట్లోవి తినేదాన్నంట. కాని ఇప్పుడైతే అమ్మ చెసిన ప్రతీది నాకు చాలా ఇష్టం.ఇంకా రోజు ఊరికి వెళ్తున్నా అని బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళేదాన్నట.నేను స్కూల్ నుండి ఒకసారి తిరిగి వస్తుంటే ఒక చిన్న కాలువలో నేను, నా టిఫిన్ బాక్స్ కొట్టుకు పోయాము.అప్పుడు నా చిన్ననాటి స్నేహితుడు ఒకరు కాపాడారు.అదైతే భలే నవ్వు వస్తుంది నాకు.చిన్నప్పుదు డ్యాన్స్ కూడ చేసాను స్కూల్లో.నాకు ఇష్తమైన మా చిన్నప్పటి పంతులు పేరు కిషన్ రావ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే, ఇలా చదువుకోవడానికి కారణం అతను నాకు చేసిన భోదనే.
Posted by p.v.mahesh kumar at 11:11 AM